మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్ తమిళ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , జయరామ్ , ప్రకాష్ రాజ్, పార్తీపన్, శరత్‌కుమార్, ప్రభులతో పాటు పలువురు నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్ మూవీ ఫస్ట్ పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పొన్నియిన్ సెల్వన్ 1 మూవీ తెలుగు వెర్షన్ ని దిల్ రాజు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం అనంత శ్రీరామ్ రచించగా మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ ఆధ్వర్యంలో మనో, అనురాగ్ కులకర్ణి కలిసి ఆలపించిన .చోళ చోళ… అంటూ సాగే పాటని హైదరాబాద్‌లో విడుదల చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మణిరత్నం మాట్లాడుతూ.. తాను ఈ సినిమా తీస్తున్నందుకు చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలనీ , ముఖ్యంగా రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలనీ , ఇలాంటి పెద్ద పెద్ద కథల్ని ఎలా తీయాలో బాహుబలి తీసి చూపించి మా లాంటి దర్శకులకు ఓ మార్గం సుగమం చేశారనీ , బాహుబలి రెండు పార్టులు రిలీజ్ చేసిన తర్వాత ఒకే కథని ఇలా రెండు పార్టులుగా అద్భుతంగా తెరకెక్కించొచ్చు అని రాజమౌళి నిరూపించారనీ , దాంతో పొన్నియిన్ సెల్వన్ కథని కూడాతాను రెండు పార్టులుగా తీద్దామని ఫిక్స్ అయ్యాననీ , రాజమౌళి వల్లే ఇది సాధ్యమైందనీ చెప్పారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్టార్ డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























