ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార ”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. పలు ఎమోషన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన”బింబిసార”, “సీతారామం” సినిమాలు విజయం సాధించడం తో టాలీవుడ్ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సినీ ప్రముఖులు ఈ రెండు సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. “బింబిసార” చిత్రం రెండు రోజుల్లోనే దాదాపు పది కోట్ల షేర్‌ను రాబట్టింది. ఈ మూవీ నైజాం ఏరియా కలెక్షన్స్ మూడు రోజులలో ఐదు కోట్లను దాటినట్లు సమాచారం.”బింబిసార” సక్సెస్‌ను పురస్కరించుకొని సినిమా టీమ్‌కు నిర్మాత, నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్రాజుసక్సెస్ పార్టీ ఇచ్చారు. ఆ సక్సెస్ పార్టీ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































