వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“సీతారామం ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ “సీతారామం” మూవీ లోని సాంగ్ ను పాడటం విశేషం.”సీతారామం” మూవీ లో విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పన లో , కృష్ణకాంత్ సాహిత్యం అందించిన , ఎస్.పి చరణ్ గానం చేసిన “ఇంతందం ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సాంగ్ ను దుల్కర్ స్టేజ్ పై పాడగా ఆ వీడియో ను వైజయంతీ మూవీస్ సంస్థ ఇన్ స్టా గ్రామ్ షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























