వశిష్ఠ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ బింబిసార. టైమ్ ట్రావెల్, పీరియాడిక్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో పాటు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. అది కూడా ఆకట్టుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని వ్యూస్ తో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం. ఇదే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక సెన్సార్ సభ్యుల నుండి ఈసినిమాకు పాజిటివ్ టాకే వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈసినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలిచిపోయేలా కనిపిస్తుంది. చూద్దాం మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో..

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































