సీనియర్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లో ‘చిరు’

Megastar Chiranjeevi Birthday Wishes to Senior Actor kaikala Satyanarayana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Meets Kaikala Satyanarayana,Senior Actor Kaikala Satyanarayana,kaikala Satyanarayana Birthday,Chiranjeevi Wishes kaikala Satyanarayana on His Birthday, kaikala Satyanarayana latest Health Updates,Chiranjeevi Visits kaikala Satyanarayana House and Wishes on his Birthday,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Godfather Movie Latest Updates, Chiranjeevi Next Project,Chiranjeevi latest News,Chiranjeevi About kaikala Satyanarayana

నవరస నటనా సార్వభౌముడిగా ఆరు దశాబ్ధాలపాటు తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో నటించారు కైకాల సత్యనారాయణ. సామాజిక, పౌరాణిక సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా అలరించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నారు లాంటి దిగ్గజాలతో సమానంగా కైకాల సత్యనారాయణ పాత్రలు ఉండేవి. ఒక అన్న పాత్ర అయినా, తండ్రి పాత్ర అయినా, కరడు కట్టిన విలన్ పాత్ర అయినా ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు జీవం పోసేవారు. తన సినీ ప్రయాణలో ఇప్పటి వరకూ దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు. 1935 జులై 25న జన్మించిన కైకాల 87వ వసంతలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆయన పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్నారు. స్వయంగా కైకాల నివాసం వద్దకు వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసి ఆయనతో కేక్ కట్ చేయించారు. అంతేకాదు పెద్దలు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు నాడు ఆయన్ని స్వయంగా కలవడం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను… అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా కైకాల సత్యనారాయణ చిరంజీవి సినిమాల్లో కూడా పలు పాత్రల్లో నటించారు. యముడికి మొగుడు, బావగారు బాగున్నారా? కొండవీటి దొంగ వంటి చిత్రాల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా నవ్వును తెప్పిస్తాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.