సెన్సిటివ్ ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడి స్టైల్ వేరు.‘అందాల రాక్షసి’, ‘పడి పడి లేచె మనసు’ వంటి సున్నితమైన ప్రేమకథలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి ఇప్పుడు మరో ఇంటెన్స్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, పాటలు వరుసా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసినిమా కూడా మంచి పీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందని అర్థమవుతుంది. “ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి..“ అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఏళ్ల కిందట రామ్ రాసిన ఉత్తరాన్ని సీతకు చేర్చే బాధ్యతను రష్మిక తీసుకుంటుంది. ఆమెకు సాయం అందించే పాత్రలో దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ కనిపించారు. సీత, రాముల ప్రేమకథని ఆనాటి వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై అశ్విని దత్, ప్రియాంక్ దత్ నిర్మిస్తున్న ఈసినిమాలో మృణాళిని ఠాకూర్ కూడా నటిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్ర పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీఎస్ వినోద్ సినిమాట్రోగాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అవుతుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























