ఆర్ట్‌సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ బ్యానర్స్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో “లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” హిందీ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీ స్ఫూర్తితో ముందుకు సాగే యువతిగా పూజా భలేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “లడ్‌కీ:ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషలతో పాటు చైనీస్ భాషలో జూలై 15 వ తేదీ విడుదల కానుంది.ఈమూవీ తెలుగు భాషలో “అమ్మాయి” టైటిల్ తో రిలీజ్ అవుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చైనాలో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా “లడ్‌కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మూవీ నిలువనుంది.చైనీస్ భాషలో “గర్ల్ ‘డ్రాగన్” పేరుతో దాదాపు 40000 థియేటర్‌లలో విడుదల చేయడానికి వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ “లడ్‌కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్” మూవీ టీమ్ కు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆర్ జి వి “లడ్ కీ “ఇండియా ఫస్ట్ రియలిస్టిక్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ అనీ , ఇండియా లో 5 భాషలతో పాటు చైనా లో కూడా రిలీజ్ కానుందనీ , ఆల్ ది బెస్ట్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























