గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈసినిమాను ప్రకటించడానికి అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేకపోయింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేసినా కూడా షూటింగ్ మొదలుపెట్టలేకపోయారు. దీనికి పలు కారణాలు లేకపోలేదు. పవన్ వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. మధ్యలో రాజకీయాలు.. మరోవైపు కరోనా ఇలా పలు కారణలా వల్ల లేట్ అవుతూ వస్తుంది. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఎప్పుడో మొదలుపెట్టిన హరి హర వీరమల్లు సినిమానే ఇంకా పూర్తి కాలేదు. అది కంప్లీట్ అయితే కానీ ఈసినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికి తోడు ఈమధ్య ఈసినిమా ఆగిపోయిందంటూ వార్తలు మొదలయ్యాయి. రీసెంట్ గా స్వయంగా ఓ వేదిక మీద పవనే ఈసినిమా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేయడంలో బిజీగా ఉన్న హరీష్ ఇప్పుడు పవన్ కు ఫైనల్ నరేషన్ ఇవ్వగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కాల్ షీట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో షూట్ కి రెడీ కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అఫీషియల్ గా ఇవ్వనున్నారట.
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి గబ్బర్ సింగ్ తరువాత రానున్న సినిమా కావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























