మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాపై టీజర్ తో అంచనాలను మరింత పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. అయితే ఈసినిమా టీజర్ రిలీజ్ సమయంలో విక్రమ్ అస్వస్థతకు గురవ్వడంతో టీజర్ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయారు. ఈనేపథ్యంలో విక్రమ్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో విక్రమ్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోను మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇక ఈవీడియోలో విక్రమ్ ఏకంగా 5 భాషలకు డబ్బింగ్ చెబుతున్నట్టు తెలుపుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈసినిమాలో విక్రమ్ చోళ చక్రవర్తి ఆదిత్య కరికాలన్ పాత్రలో నటిస్తున్నాడు.
Our Chola Tiger Roars – in 5 tongues!#PS1Teaser #PonniyinSelvanTeaser #PonniyinSelvan#PS1 releasing in theatres on 30th September in Tamil, Hindi, Telugu, Malayalam and Kannada!@madrastalkies_ @LycaProductions #ManiRatnam @arrahman #Vikram @Tipsofficial pic.twitter.com/0cIEQIIrUU
— Lyca Productions (@LycaProductions) July 13, 2022
ఇంకా ఈసినిమాలో శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, పార్థీబన్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి మణిరత్నం కూడా ఎంతోకాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసినిమాతో తను హిట్ ను కొడతారేమో చూడాలి.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























