కళ్యామ్ రామ్ కూడా ఒక్కొక్క సినమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బింబిసార రిలీజ్ కు సిద్దమవుతుంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టేశాడు. నేడు తన 19వ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మైత్రీ మూవీ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించనున్నారు. ఈనేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ఓ టేబుల్ పై ఉన్న గన్స్ ను పట్టుకంటూ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు తర్వలోనే ఫస్ట్ మరియు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు.. కాస్ట్ అండ్ క్రూ ఎవరనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
Team #NKR19 wishes @NANDAMURIKALYAN Garu a very Happy Birthday 💥
Title and first look out soon ❤️🔥#HappyBirthdayNKR ❤️ pic.twitter.com/afvEqOKFaC
— Mythri Movie Makers (@MythriOfficial) July 5, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































