నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో భాగంగా వస్తున్న సినిమానే బింబిసార. సోషియోఫాంటసీ నేపథ్యంలో వస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకూ చేయని జోనర్ లో మొదటిసారి కళ్యాణ్ రామ్ చేస్తున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా కళ్యాణ్ రామ్ చాలా సైలెంట్ గానే స్టార్ట్ చేసేశాడు. అంతే సైలెంట్ గా పూర్తిచేస్తున్నాడు. ఇక మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ నే సొంతంచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ మాత్రం సినిమాపై మరోసారి అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో విజువల్స్, అలానే కళ్యాణ్ రామ్ నటన హైలెట్ గా నిలిచాయి. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ తన నటనతో ఆకట్టుకునేలా ఉన్నాడు. అలాగే కాలయాత్ర ద్వారా కళ్యాణ్ ఆధునిక ప్రపంచంలో రావడం చూపించారు. అసలు బింబిసారుడు ఆధునిక కాలంలోకి రావాల్సిన అవసరం ఏముంది అనేది కథ. ‘ రాక్షసులెరుగని రావణ రూపం..శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్దం..త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం అంటూ.. బింబిసారుడంటేనే మరణ శాసనం…ఇక్కడ రాక్షసుడైనా..భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’ అని చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే 🔥
Regal #BimbisaraTrailer out now!
–https://t.co/ZDQpkP7toQ#BimbisaraOnAugust5th #HappyBirthdayNKR@NANDAMURIKALYAN @DirVassishta @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @mmkeeravaani @ChirantannBhatt pic.twitter.com/cM7s5jjWHP— NTR Arts (@NTRArtsOfficial) July 4, 2022
కాగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































