విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎఫ్3. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన కామెడీఎంటర్ టైనర్ ఎఫ్3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి నుండి ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు. ఇక వాటిని ఏ మాత్రం తగ్గించకుండా చూస్కున్నాడు అనిల్ రావిపూడి. పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు అందించింది. సినిమాలో అక్కడక్కడ కొన్ని లాజిగ్ లేని సీన్స్ ఉన్నా..అవన్నీ కూడా అనిల్ మ్యాజిక్ లు అంటూ..జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.మొత్తానికి సమ్మర్ సోగాళ్లుగా సమ్మర్ బరిలోకి లేటుగా వచ్చినా తమ సత్తా ను చూపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మే 27న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి రోజు నుండే కలెక్షన్ల విషయంలో కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టగా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 110 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని.. అంతేకాదు నైజాం, కృష్ణా, గుంటూరు ఇంకా వైజాగ్ లో ఈసినిమా ఇప్పటికే లాభాలు అందిస్తుందని.. ఏపీలోని ఇతర ఏరియాల్లో 80 శాతం రికవరీ అయిపోయింది.. బ్రేక్ ఈవెన్ కు దగ్గర్లో ఉందని తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































