‘అంటే సుందరానికీ’ ప్రోమో సాంగ్ రిలీజ్..!

Nani Ante Sundaraniki Movie Promotional Song Out Now

తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్నాడు నాని. అందకే నాని నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తుంటారు. రొటీన్‌కు భిన్నంగా క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నాని నుండి వస్తున్న సినిమా అంటే సుందరానికిీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా ఈనెల 10వ తేదీన రిలీజ్ అవుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ తో పాటు పాటలు కూడా రిలీజ్ చేశారు. ప్రతి అప్ డేట్ కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సినిమా ప్రోమో సాంగ్ విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. శంకర్ మహదేవన్, శ్వేతా మోహన్ ఆలపించారు. ఇక ఈ ప్రోమో సాంగ్ ను మంచి క‌ల‌ర్‌ఫుల్‌గా పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ఈ పాటద్వారా సినిమా కథను కూడా చెప్పినట్టు అర్థమవుతుంది. హీరో ‘చెంగుచాటు చేగువేరా’, హీరోయిన్ ‘విప్లవాల సితార’ అంటూ వాళ్ళ క్యారెక్టరైజేషన్లను పరిచయం చేశారు. ‘సుందరానికి పెళ్లి అయినా కాకపోయినా ఏమైనా సెలబ్రేషనే. ఏంటి నమ్మడం లేదా? కావాలంటే థియేటర్లకు వచ్చి చూడు’ అంటూ నాని చెప్పిన డైలాగ్ మొత్తానికి సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో నాని బ్ర‌హ్మ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా న‌టించింది. న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌. తెలుగులో ‘అంటే సుందరానికి’ పేరుతో, తమిళంలో ‘ఆదదే సుందర’ గా, మలయాళంలో ‘ఆహా సుందర’ గా రిలీజ్ చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =