ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ ఎక్కువైన సంగతి తెలిసిందే. ఇక అందులోనూ సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఎలాంటి సంచనాలు సృష్టిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక వీటి ప్రభావం నార్త్ బాక్సాఫీస్ పై కూడా పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనివల్లే నార్త్ సినిమాలు, సౌత్ సినిమాలు అన్న రచ్చ మొదలైంది. ఇక ఈమధ్య స్టార్ హీరోలకు కూడా తమ సినిమా ప్రమోషన్లలో ఈ ఇష్యూపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు హీరోలు కూడా స్పందిస్తూ సౌత్, నార్త్ అనేది లేదు ఇండియన్ సినిమాలు అంటూ సమాధానాలు చెబుతున్నారు. కానీ పదే పదే దీనిపై ప్రశ్నలు అడిగినా కూడా హీరోలకు విసుగు వస్తుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది అక్షయ్ కుమార్ కు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న సినిమా పృథ్విరాజ్. ఇక ఈసినిమా జూన్ 3వ తేదని రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా అక్కడ సౌత్ సినిమాల గురించి ప్రశ్నించగా..దయచేసి అలా డివైడ్ చేసి మాట్లాడే విధానాన్ని ఆపండి.. నార్త్ ఇంకా సౌత్ అంటూ ఏం లేదు.. నటీనటులు కలిసి పని చేయాల్సిన సమయం వచ్చింది. అల్లు అర్జున్ త్వరలో నాతో పని చేయాలి మరియు నేను మరొక సౌత్ స్టార్‌తో నటిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా రిపోర్టర్లు ఈ రకమైన ప్రశ్నలు వేయడం ఆపితే హీరోలకు కూడా మంచిది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































