లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. ఇక ఈసినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇక ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా తెలుగు ప్రమోషన్స్ కూడాజోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా విక్టరీ వెంకటేష్ వచ్చారు. ఈనేపథ్యంలోనే ఈవెంట్ లో నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమా నుండి పాటను రిలీజ్ చేస్తున్నట్టు అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. చెప్పినట్టే ఈ సినిమానుండి చిల్ మారో చిల్ చిల్ అనే పాటను రిలీజ్ చేశారు. కాగా విక్రమ్ సినిమా తెలుగు హక్కులను నితిన్ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ వారు సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే. తెలుగులో దాదాపు 400 స్క్రీన్లపై ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
Let’s trip on the floor with #ChillMaaro🕺🏻🥁 #MacherlaNiyojakavargam 1st Single out now🤩
▶️ https://t.co/q4Sia8TwfD🎤@AzizNakash @SanjanaKalmanje
📝#KrishnaChaitanya
🎶#MahathiSwaraSagar@actor_nithiin @CatherineTresa1 @IamKrithiShetty @SrSekkhar @SreshthMovies @adityamusic pic.twitter.com/NpPIdMmoEq— Sreshth Movies (@SreshthMovies) May 31, 2022
ఇదిలా ఉండగా ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’. ఈసినిమాతోనే రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈసినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా నితిన్ కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























