వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. క్రిస్టియన్ అమ్మాయితో బ్రాహ్మణ యువకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే ఈసినిమా కథ. ఇక ఈసినిమా జూన్ 10వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. సినిమా టీజర్ చూస్తే రొమాన్స్ అండ్ కామెడీ ప్రేక్షకులను మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి నాని రెడీ అయిపోయినట్టు అర్థమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జూన్ 2వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే తాాజాగా ఈట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వేదికను ఫిక్స్ చేస్తూ అధికారికంగా తెలియచేశారు మేకర్స్. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్శిటీలోని సర్ సీఆర్ రెడ్డి కాన్వొకేషన్ హాల్‌లో ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సాయంత్రం 5గంటల నుండి ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. తెలుగులో ‘అంటే సుందరానికి’ పేరుతో, తమిళంలో ‘ఆదదే సుందర’ గా, మలయాళంలో ‘ఆహా సుందర’ గా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































