తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసిన వారిలో ఎంతోమంది ఉండగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి. తెలుగు సినీ చరిత్రలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు అనేకం. సాంఘిక, పౌరాణిక ఇలా ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అన్నట్టు ఉంటుంది. సినీ చరిత్రలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. అలాంటి నటుడు ఇంత వరకూ రాలేదు.. ఇకపై కూడా అలాంటి నటుడిని చూడటం అనేది జరగదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు ఆయన శత జయంతి సందర్భంగా సెలబ్రిటీలు అందరూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చిరంజీవి కూడా తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























