షూటింగ్ పూర్తిచేసుకున్న ‘ది వారియర్’

Rams The Warriorr shoot wrapped,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu Movie,The Warriorr Latest Updates,The Warriorr Shooting Updates,The Warriorr Shooting Wrapped up, The Warriorr Movie Shoot Wrapped up,Ram The Warriorr Movie Wrapped,Ram Upcoming Movie The Warriorr,Ram Latest Movie Updataes,Ram latest Movie Shoot Updates

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక సినిమా చేసిన వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో కూడా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం షూటింగ్ చివరి దశలో ఉండగా.. గత వారం రోజుల నుండి ఇంట్రడక్షన్ సాంగ్ ను షూట్ చేస్తున్నారని.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫి చేస్తున్న ఈ పాటలో దాదాపు 150 డ్యాన్సర్ అలానే 100 మంది మోడల్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. అలానే పాటలు కూడా ఒక్కొక్కటి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూన్ 14న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇంకా స్పీడు పెంచాలని అలానే వెరైటీగా ప్రమోషన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + six =