మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ ను బాలీవుడ్ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణం గా పలు పెద్ద బడ్జెట్ సినిమాల రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయిన”అఖండ “, “పుష్ప :ది రైజ్”మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ సంవత్సరం రిలీజ్ అయిన “ఆర్ ఆర్ ఆర్”, “కె జి ఎఫ్ చాప్టర్ 2 “,
“సర్కారు వారి పాట ” మూవీస్ భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్నాయి. కలెక్షన్ల పరంగా” RRR”, కె జిఎఫ్2″ చిత్రాలు ఎక్కువ కలెక్షన్లను రాబట్టినప్పటికీ “పుష్ప” సినిమాను మాత్రం ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు.ఈ విధంగా ఈ సినిమాని ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి చూడటానికి కారణం కేవలం సినిమా టికెట్ల రేటు తక్కువగా ఉండటమే.ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి ఆదరించిన సినిమాలలో “పుష్ప” సినిమా మొదటి స్థానంలో నిలబడి సరికొత్త రికార్డును సృష్టించింది.ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమాని ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: