న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ నజ్రియా నజిమ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘అంటే సుందరానికి’. నజ్రియా చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. అయితే డబ్బింగ్ సినిమా రాజా రాణి సినిమా వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆసినిమాతో తన నటనతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకంది. ఇక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. పంచె కట్టు అనే పాట అలానే ఎంత చిత్రం అనే మెలొడి సాంగ్ రిలీజ్ అవ్వగా రెండు పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రంగో రంగా అనే ఈపాటను ఈ నెల 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Kickstarting with a quirk 😉#AnteSundaraniki #RangoRanga pic.twitter.com/bgYY7xq3h7
— Nani (@NameisNani) May 21, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: