“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు సక్సెస్ ఫుల్ “ప్రేమ కథా చిత్రమ్”, “సమ్మోహనం ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “V” మూవీ లో డి సి పి ఆదిత్య గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ కి సుధీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరో తెలుగు , హిందీ భాషలలో ఒక మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రానికి “మామా మశ్చీంద్ర” అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేశారు.హీరో సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుధీర్ బాబు రెట్రో లుక్ లో రాక్ స్టార్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: