సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “సర్కారు వారి పాట” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు పరశురామ్ , హీరోయిన్ కీర్తి సురేష్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ .. మహేష్ బాబు గారి గురించే ఈ స్క్రిప్ట్ రెడీ చేశాననీ , వేరే సినిమాలతో ఈ మూవీ ని పోల్చలేమనీ , హీరో గారిది ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనీ , ఆయన లుక్ , డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ లో ఉంటుందనీ చెప్పారు. కీర్త్తిమాట్లాడుతూ .. కళావతి వంటి క్యారెక్టర్ లో ఇంతకు ముందు నటించలేదనీ , ఈ క్యారెక్టర్ తనకు చాలా నచ్చిందని , తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉందనీ చెప్పారు. “సర్కారు వారి పాట”లో కీర్తి సురేష్ రోల్ చాలా స్ట్రాంగ్ అనీ , కీర్తి తో వర్క్ చేయడానికై చాలా కాలంగా ఎదురు చూశాననీ ,ఈ మూవీ ఇంత బాగా రావడానికి నిర్మాతలు చాలా ఎంకరేజ్ చేశారనీ , మంచి టెక్నీషియన్స్ ను ఏర్పాటు చేశారనీ పరశురామ్ చెప్పారు. షూటింగ్ టైమ్ లో మహేష్ బాబు గారి నుంచి చాలా నేర్చుకున్నాననీ , కళావతి సాంగ్ సక్సెస్ ను ఎక్స్పెక్ట్ చేశాననీ , 150 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం అనీ , సాంగ్స్ అన్నీ నచ్చాయనీ కీర్తి చెప్పారు. స్క్రిప్ట్ కు సంబంధించి వంద శాతం కృషి చేశాననీ పరశురామ్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































