సుమంత్ కూడా చిన్నగా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు ఇప్పుడు తను ఎంచుకునే సినిమాల్లో విభిన్నత ఉండేలా చూసుకుంటున్నాడు. ఇటీవలే తను నటించిన మళ్ళీ మొదలైంది సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. ఇంకా అనగనగా ఒక రౌడీ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ కావాల్సింది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక వీటితో పాటు సుమంత్ మరో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అహం రీబూట్ అనే సినిమా చేస్తున్నాడు సమంత్. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాను గత ఏడాదే లాంఛనంగా ప్రారంభించి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నారు. ఇక నేడు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. డిఫరెంట్ గా ఉన్న సుమంత్ లుక్ ఆకట్టుకోవడంతో పాటుసినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
Presenting the first look of #AhamReboot !@Raghuveer88199 @nooble451 @reachprash @VayuputraEnts @SOriginals1 #VarunAnkarla @SriramMaddury @GskMedia_PR @thisisputta pic.twitter.com/Q5NK0hBJWs
— Sumanth (@iSumanth) April 25, 2022
కాగా ఈసినిమాను వాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ ఎరబోలు సమర్పిస్తున్నారు. ఈ మూవీ కి శ్రీరామ్ మద్దూరి సంగీతం అందిస్తున్నారు. మరి ఈసినిమా సుమంత్ కు ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























