‘సలార్’.. హైలెట్ గా లోయలో యాక్షన్ సీక్వెన్స్..!

Prabhas And Prashanth Neel Salaar Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Pan India Star Prabhas,Prabhas Movie Updates,Prabhas New Movie Updates,Prabhas latest Movie,Prabhas Coming Up Movie Salaar, Prabhas and Prashanth Neel Salaar Movie Updates,Salaar movie Recent Updates,Prabhas movie with Prahsnath Neel,Director Prshanth Neel Movie Salaar, Salaar Movie Action Sequence

రీసెంట్ గానే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమాకోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కె.జి.యఫ్ 2 సినిమా సంచలన విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే ఈసినిమాలో ప్రభాస్ పాత్ర గురించి వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఈసినిమా లో ప్రభాస్ వయోలెంట్ గా రూత్ లెస్ పాత్రలో నటిస్తాడని అంటున్నారు. అంతేకాదు ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయన్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో ఒక లోయలో ఇంట్రెస్టింగ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ ఛేజింగ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ కు ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారట. హాలీవుడ్ స్థాయిలో ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుందని తెలుస్తోంది.

కాగా ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రభాస్‌ కు విలన్‌గా చేస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.