ఏ భాషలో నటించడానికైనా సిద్ధం – శ్రీనిధి శెట్టి

Srinidhi Shetty talks about working for other language films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Srinidhi Shetty,Actress Srinidhi Shetty,Srinidhi Shetty Movie Updates,Srinidhi Shetty latest Movie Updates,Srinidhi Shetty Updates,Srinidhi Shetty Upcoming Movies, Srinidhi Shetty About other Language,Srinidhi Shetty Working FOr Other Languages,Srinidhi Shetty Ready to work for Other languages,Srinidhi Shetty About working with Other language Industry, Srinidhi Shetty About Working with Other Language movies

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ అయిన శ్రీనిధి శెట్టి అందాల పోటీలలో 2015 సంవత్సరం లో మిస్ కర్ణాటక, 2016 సంవత్సరంలో మిస్ దివా సుప్రనేషనల్ , మిస్ సుప్రనేషనల్ విన్నర్ గా నిలిచారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″మూవీ తో శాండల్ వుడ్ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని శ్రీనిధి శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. శ్రీనిధి శెట్టి కథానాయికగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న “కోబ్రా “మూవీ తో శ్రీనిధి కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. “కోబ్రా “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ .. నటిగా అవార్డులు పొందడం కంటే కూడా గొప్ప సినిమాలలో భాగమవ్వాలనే తాను కోరుకుంటున్నాననీ , మంచి సినిమాలో నటిస్తే సహజంగానే ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారనీ , ఒక నటిగా తాను భాషా హద్దులు పెట్టుకోవడం లేదనీ , ఏ భాష ల మూవీస్ లో అవకాశాలు వచ్చినా నటించేందుకు సిద్ధమనీ , తన అభిమాన హీరోల జాబితా కాస్త పెద్దదేననీ , ప్రతి ఇండస్ట్రీలోనూ తాను కలిసి నటించాలని కోరుకుంటున్న స్టార్స్‌ నాలుగైదుగురు  ఉన్నారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =