న్యాచురల్ స్టార్ నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోతాడు కాబట్టే న్యాచురల్ స్టార్ అన్న పేరును సొంతం చేసుకోగలిగాడు. ఇప్పుడు మాత్రం
విభిన్న తరహా కథలను ఎంచుకుంటూ.. విభిన్న పాత్రలను చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈమధ్య కాలంలో వచ్చిన వి, టక్ జగదీష్ రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ మూడు సినిమాలు కూడా కాస్త డిఫరెంట్ పాత్రలే. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో రావడానికి సిద్దమయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాని హీరోగా, మలయాళి బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘అంటే సుందరానికి’. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈమూవీ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. బాగా సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ ప్రసాద్ కి, మోడరన్ గా ఉండే క్రిస్టియన్ అమ్మాయి లీలకి మధ్య నడిచే ప్రేమ ప్రయాణమే అంటే సుందరానికి అని టీజర్ చూస్తే తెలుస్తుంది. పూర్తి భిన్న దృవాలులాంటి కుటుంబాల నుంచి వచ్చినా ఈ ఇద్దరి మధ్య అసలు ప్రేమ ఎలా పుట్టింది, డైరెక్టర్ ఎలా చూపించాడు అన్నది చాల ఆసక్తి కరమైన విషయం. నాని ఎప్పటిలాగే. న్యాచురల్ గా అదరగొట్టాడు. మా ఇంట్లో ఆచారం ప్రకారం ఎవరు సముద్రం దాటెళ్లి వచ్చినా రెండు రోజులు అందరూ ఇలాగె డ్రెస్ వేసుకుంటారు..అని చెప్పిన డైలాగ్ అయితే సూపర్ అనే చెప్పాలి..అలాగే నాని, నజ్రియా కెమిస్ట్రీ అయితే చాలా క్యూట్ గా ఉంది.
Experience the Glimpse of Love, Laughter and Families of Sundar & Leela ♥️#AnteSundaranikiTeaser – https://t.co/TM7tuIHSBe#AhaSundaraTeaser – https://t.co/p1zKF5rp3L#AdadeSundaraTeaser – https://t.co/d5t0l6myoi
Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/96bGbabNjT
— Mythri Movie Makers (@MythriOfficial) April 20, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































