ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ పై దర్శకుడు కొరటాల అప్ డేట్ ఇచ్చారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “#NTR 30 ” మూవీకి ఒక స్ట్రాంగ్ స్టోరీ సిద్ధం చేశాననీ , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందనీ , జూన్ నెలలో షూటింగ్ ప్రారంభం కానుందనీ చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “జనతా గ్యారేజ్ ” మూవీ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న”#NTR 30 ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: