పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు పూజా హెగ్డే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “ఏప్రిల్ 29 రిలీజ్ కానుంది. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో జిగేల్ రాణి స్పెషల్ సాంగ్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ తో పూజా హెగ్డే ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఇప్పుడు “F 3” మూవీ లో స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. “F 3” మూవీ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ లో స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జాయిన్ అయ్యారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: