‘కె.జి.యఫ్ 2’ ఫస్ట్ డే నార్త్ కలెక్షన్స్..!

KGF Chapter 2 First Day North Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chpater 2 Movie updates,KGF Chpater 2 Movie latest Movie update,KGF Chpater 2 Movie Collections,KGF Chpater 2 Movie Box Office Collections,KGF Chpater 2 Movie First Day Collections, KGF Chpater 2 Movie Day 1 Collections in Bollywood,KGF Chpater 2 Movie Bollywood Collections,Yash KGF Chpater 2 Movie Bollywood Box Office collections,KGF Chpater 2 Movie North Collections, KGF Chpater 2 Movie 1st day Collections In North

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.యఫ్2. ఈసినిమా కె.జి.యఫ్ చాప్టర్1 కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పాటు పలు రికార్డులను సైతం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా యష్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు అదే భారీ అంచనాల మధ్య కె.జి.యఫ్ 2 ను తెరకెక్కించారు. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నిజానికి ఈసినిమా ప్రీ బుకింగ్సే ఓ రేంజ్ లో జరిగాయి. ఈనేపథ్యంలో ఫస్ట్ డే భారీ కలెక్షన్సే రాబట్టుకున్నట్టు అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా నార్త్ కలెక్షన్స్ పై సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ అప్ డేట్ ఇచ్చారు. 2018లో వచ్చిన కె.జి.యఫ్ పార్ట్1 సినిమా 44 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టగా.. కె.జి.యఫ్ 2 మాత్రం 55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి పార్ట్ 1 కలెక్షన్స్ ను క్రాస్ చేసిందని తెలిపారు. అంతేకాదు కె.జి.యఫ్ 3 కోసం కూడా వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు.

మరి కె.జి.యఫ్ కు నార్త్ లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. పార్ట్1 రిలీజ్ అయినప్పుడు కూడా హిందీలో ఈసినిమా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. యష్ నటనకు, యాక్షన్ సీక్వెన్స్ కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ మరోసారి తన ఇంట్రెస్ట్ ఎంత ఉందో కలెక్షన్స్ పరంగా చూపించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =