ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కె.జి.యఫ్ 2 సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది. ఈనేపథ్యంలో వరుసగా ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఇక ఈసందర్భంగా సంజయ్ దత్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తనకు టాప్ రేటింగ్ కూడా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ కు ఎంత రేటింగ్ ఇస్తారు అని అడిగినప్పుడు సంజయ్ దత్ అసలు ఏమాత్రం ఆలోచించకుండా.. తన కెరీర్లో ఇప్పటివరకూ పనిచేసిన టాప్ ఐదుగురు దర్శకులలో ఒక్కరు అని చెప్పారు. మరి సంజయ్ త్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఎంతో మంది లెజెండరీ డైరెక్టర్స్ తో చేసి ఉంటారు. అలాంటి సంజయ్ దత్ లాంటి హీరో నుండి ప్రశాంత్ నీల్ కు ఇలాంటి కాంప్లిమెంట్ రావడం విశేషమనే చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ కానుంది. కె.జి.యఫ్ ఫస్ట్ పార్ట్ సక్సెస్ కారణంగా ఇప్పుడు కె.జి.యఫ్2 సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, ఇంకా రావు రమేష్ తో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























