తమిళ్ హీరో విష్ణు విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆరణ్య సినిమాతో మంచి పేరుతెచ్చుకున్న విష్ణు విశాల్ ఇటీవలే తమిళ చిత్రం ఎఫ్.ఐ.ఆర్ లాంటి క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. నిన్ననే ఈసినిమా టైటిల్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. చల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మట్టి కుస్తీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమా షూటింగ్ ను వెంటనే స్టార్ట్ చేసేశారు. నేడు ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#MattiKusthi 🤼♂️ goes on floors from today in Tenkasi ! @AishuLekshmi to play the female lead.https://t.co/zK9cG2ryGe@RaviTeja_offl @TheVishnuVishal @RTTeamWorks @VVStudioz @ChellaAyyavu @Richardmnathan @justin_tunes @editor_prasanna pic.twitter.com/KEI2Q7Ee4Z
— RT Team Works On DUTY (@RTTeamWorks) April 6, 2022
కాగా ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్ ఎం.నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరోవైపు విష్ణు విశాల్ నుండి వచ్చిన ఎఫ్.ఐ.ఆర్ సినిమాను తెలుగులో ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ సమర్పణలోనే విడుదలైంది. ఇప్పుడు ఇది రెండో సినిమా. ఈసినిమాకు వీరిద్దరికి మంచి సక్సెస్ ఇస్తుందేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































