దర్శకధీరుడు రాజమౌళి నుండి సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో రుజువుచేశాడు. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు మాత్రం మరింత ఆసక్తిగా ఎదురుచూడగా.. వారి ఎదురుచూపులకు తగిన ఫలితం దక్కింది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు విమర్శకులు అందరూ సినిమా గొప్పగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈసినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ లు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగాఅల్లు అర్జున్ కూడా ఈసినిమాను చూసి తన ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ఆర్ఆర్ఆర్ టీమ్ అందరికీ అభినందనలు.. సినిమా అద్భుతంగా ఉంది.. ‘‘మనమంతా గర్వపడే రాజమౌళి విజన్ గొప్పగా ఉంది. బ్రదర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చేశాడు.. చాలా గర్వంగా ఉంది.. ఇక పవర్ హౌస్ లాంటి బావ తారక్ బ్రిలియంట్ పెర్ఫామెన్స్.. అజయ్ దేవగణ్, అలియా చాలా బాగా చేశారు. కీరవాణి, సెంథిల్ కుమార్, డీవీవీ దానయ్య.. ఇంకా అందరికీ ప్రత్యేక శుభాభినందనలు. భారతీయ సినిమాను గర్వపడేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఇది కిల్లర్ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
కాగా ఇటీవలే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఇక త్వరలోనే ఈ సినిమా పార్ట్ 2 ‘పుష్ప-దిరూల్’ షూటింగ్ ను కూడా ప్రారంభం చేయనున్నారు.




[subscribe]
@tarak9999 for a spectacular show. Brilliant Presence by respected @ajaydevgn Garu & our sweetest @aliaa08 . And my spl wishes to @mmkeeravaani garu, @DOPSenthilKumar garu, Dvv Danayya garu & many others. Thank you all for making INDIAN CINEMA proud. This is a Kille R R R !
— Allu Arjun (@alluarjun) March 26, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























