డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
What a Massive Welcome by our #Dubai fans! Feels like we are in India… Love you so much ❤️ #RRRinDubai #RRRMovie pic.twitter.com/QqSKNr2Jnu
— RRR Movie (@RRRMovie) March 18, 2022
దుబాయ్ ఎక్స్ పో 2020 లో “ఆర్ ఆర్ ఆర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మా దుబాయ్ అభిమానుల నుండి ఘన స్వాగతం లభించిందనీ , మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుందనీ , మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామనీ అంటూ మేకర్స్ ఒక వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు, ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు ఆ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. మన స్టార్స్ కు విదేశాల్లో ఇంతటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం విశేషమనే చెప్పాలి. రాజమౌళితో సినిమా అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హీరోలకు గుర్తింపు లభిస్తుందన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: