మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేసిన ఈ మూవీ లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు .స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ పంచెస్ , అద్భుతమైన విజువల్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ ” మూవీ తరువాత వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన “గని” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























