రిలీజ్ కు ముందే రికార్డ్ లు.. 1 మిలియన్ క్లబ్ లో ‘ఆర్ఆర్ఆర్’

RRR Creates Sensational Record Before The Release Only,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, RRR,RRR Movie,RRR Movie Updates,RRR Latest Movie,RRR Movie Latest News,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, RRR Creates Sensational Record,RRR Movie Records,RRR Creates Sensational Record Collecting 1 million dollars in 15days,RRR Movie Record 1 million dollars,First India Film to Cerate Record Before Releasing the Movie RRR, 1 million dollars For RRR Movie,Ranam Roudram Rudhiram Collects 1 Million Dollars,DVV Entertainments,M. M. Keeravani Music Director For RRR Movie,M. M. Keeravani Music Director, Ram Charan as Alluri Sitarama Raju,NTR plays the role of Komaram Bheem,RRR Movie Songs,RRR Movie Super Hit Songs,RRR Movie on March 25th,Jr NTR and Ram Charan Multistarrer Big Buget Film RRR, Alia Bhatt with Ram charan,Olivia Morris with Jr NTR,Bollywood hero Ajay Devgn in RRR Movie,Shriya Saran play lead roles In RRR Movie,#RRRCelebrationAnthemfrom14th,#

ఒక సినిమా రిలీజ్ అయిన తరువాత రికార్డులు క్రియేట్ చేయడం కామనే. కానీ రిలీజ్ కు ఇంకా రెండు వారాలు ఉండగానే అప్పుడే రికార్డులు మొదలుపెట్టింది ఒక సినిమా. ఆ సినిమా మరేదో కాదు ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను భారీగానే ప్రమోషన్ చేశారు రాజమౌళి. నార్త్, సౌత్ లో కూడా అన్ని ప్రెస్ మీట్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు ఎన్టీఆర్, చరణ్ కూడా. రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మళ్లీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రికార్డు స్థాయి బుకింగ్స్ ని కొల్లగొట్టిన ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 15 రోజులు మిగిలి ఉండగానే టోటల్ గా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఇది రికార్డు సెట్ చేసిందట. మరి ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్​ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్​చరణ్, కొమురం భీమ్​గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.