మన ఇండస్ట్రీలో హీరోలకు కొదువలేదు. రోజుకో కొత్త హీరో పుట్టుకొస్తూనే ఉంటాడు. కానీ ఎంతమంది హీరోలు ఉన్నా కానీ కొంత మంది మాత్రం మరో అడుగు ముందులో ఉంటారు. అలా ఇప్పటికే స్టార్ హీరోలుగా టాలీవుడ్ ను కొంతమంది ఏలుతున్నారు. కానీ మన ఇండస్ట్రీతో పాటు పక్క ఇండస్ట్రీలో కూడా తన సత్తా చూపిస్తేనే ఆ కిక్కు వేరే ఉంటుంది. ఇక ఆ విషయంలో కూడా మనవాళ్లు సక్సెస్ అయ్యారు. అలా జాతీయ మార్కెట్ వద్ద తన సత్తాను చూపించిన హీరో ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరో అయ్యాడు. అయితే అక్కడితో ఆగకుండా బాహుబలి లాంటి సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇక తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో లవ్ స్టోరీస్ చేశాడు ప్రభాస్ అయితే చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో మరోసారి ప్రేమకథతో.. లవర్ బాయ్ గా వస్తున్నాడు. మరి ఈసినిమా కూడా ప్రభాస్ కు మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాలని కోరుకుందాం.
మరి ఇప్పటివరకూ వచ్చిన ప్రభాస్ చేసిన లవ్ స్టోరీస్ లో బెస్ట్ లవ్ స్టోరీ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”76315″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























