టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఎవరంటే ముందు వచ్చే పేరు ప్రభాస్ దే. ఎన్నో ఏళ్ల నుండి ప్రభాస్ పెళ్లి పై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. పోతూనే ఉన్నాయి కానీ ప్రభాస్ పెళ్లి పై మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. ఇక ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ప్రభాస్ కూడా ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తాడు తప్పా తను కూాడా ఎప్పుడూ క్లియర్ గా చెప్పింది లేదు. అయితే ప్రభాస్ కు ఫలానా వారితో పెళ్లి జరుగుతుంది అన్నట్టు వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ప్రభాస్-అనుష్క ల పెళ్లిపై ఇప్పటికీ రూమర్స్ ఆగలేదు.. ఆమధ్య ప్రభాస్ చేసుకోబోయేది ఈ అమ్మాయే అంటూ ఓ అమ్మాయి ఫొటో కూడా వైరల్ అయింది. ఆ తరువాత కాస్త సైలెంట్ గా ఉన్నా ఇక ఇప్పుడు మరోసారి రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ఈనేపథ్యంలో ప్రేమ విషయంలో నిజ జీవితంలో మీ లెక్క ఎన్ని సార్లు తప్పింది’ అని ప్రభాస్ ను అడగగా చాలా సార్లు.. అందుకే నాకింకా పెళ్లి కాలేదేమో అంటూ కామెడీ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ కూడా పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. అనుష్క-ప్రభాస్ ల పెళ్లి ఎందుకంటే వారు మంచి స్నేహితులు మాత్రమే.. వారి మధ్య పెళ్లి లాంటి ఫీలింగ్స్ లేవన్నారు. ప్రభాస్ కు మన సంస్కృతి సంప్రదాయాలంటే చాలా గౌరవమని.. మహిళలంటే అమితమైన మర్యాదను ఇస్తుంటారని.. అలానే తన కుటుంబానికి.. ఇంటి పెద్దకు గౌరవం ఇస్తారని ప్రభాస్ కచ్ఛితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. ప్రభాస్ చేసుకునే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా? లేక బయట వ్యక్తా అనే ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేనని.. త్వరలోనే తెలుస్తుందన్నారు. మరి ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం ఇప్పుడప్పుడే క్లారిటీ వచ్చేలా కనిపించడంలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఆ గుడ్ న్యూస్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























