టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఒక్కసారైనా తమ అభిమాన హీరోలతో మాట్లాడాలని, కలవాలని కోరుకుంటారు. ఇక మన హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా తన అభిమాని కలను నేరవేర్చాడు. రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా ఆంధ్రప్రదేష్ లో జరుపుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అక్కడ ఒక అభిమాని రామ్ చరణ్ ను కలవడానికి చాలా కష్టపడ్డాడు. తనకు ఇష్టమైన హీరో రామ్ చరణ్ ను ఎప్పటినుండో చూడాలని వెయిట్ చేస్తుండటంతో చరణ్ తనను కలిశారు. అంతేకాదు సదరు అభిమానితో ఆప్యాయంగా కాసేపు ముచ్చటించి ఫొటో దిగి పంపించారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈసినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































