విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. ఇప్పటికే ఈసినిమా నుండి హీరో హీరోయిన్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక రీసంట్ గానే ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈసినిమా నుండి టీజర్ ను 11వ తేదీన రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అది ఎవరో కాదు ఒకప్పటి క్రికెటర్ శ్రీశాంత్. శ్రీశాంత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహమ్మద్ మోబీ అనే పాత్రలో శ్రీశాంత్ నటిస్తున్నాడు.

కాగా 2013లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం వల్ల శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించిన శ్రీశాంత్ ఇప్పుడు ఈసినిమాతో తమిళ్, తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈసినిమా రూపొందుతుంది. అంతేకాదు ఈసినిమాలో సమంత నెగిటివ్ షేడ్ లో నటించనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































