పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన “ఖిలాడి ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఆ ఈవెంట్ లో హీరో రవితేజ మాట్లాడుతూ .. తాను జాతకాన్ని, అదృష్టాన్ని నమ్మననీ , కష్టాన్ని నమ్ముతాననీ , అదృష్టం అనేది ఏదో ఒకశాతం మాత్రమే ఉంటుందనీ , “ఖిలాడి”మూవీ చూశాననీ , తనకు బాగా నచ్చిందనీ , ఓపెన్ మైండ్ సెట్ తో కామన్ ఆడియెన్స్ వలే తన సినిమాలు చూస్తాననీ , “ఖిలాడి”మూవీ ని చాలా ఎంజాయ్ చేశాననీ , ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం తో ఉన్నాననీ చెప్పారు. బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత రిలీజ్ అవుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: