కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కింగ్ నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ సినిమా సీక్వెల్గా బంగార్రాజు తెరకెక్కించాడు కళ్యాణ్ కృష్ణ. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి ఈసినిమాను చాలా సినిమాల కంటే వెనకే మొదలుపెట్టారు. అయినా కూడా చాలా తొందరగానే పూర్తి చేసి ప్రమోషన్స్ కు తక్కువ రోజులున్నా కూడా మేకర్స్ సినిమాపై నమ్మకంతో సంక్రాంతికే ఈసినిమాను రిలీజ్ చేశారు. ఇక మేకర్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది. పైనల్ గా సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో విజేతగా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ రోజుతో ఈ సినిమా 25 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెబుతూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. మరి ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోయినా కూడా ఇన్ని రోజులు సినిమా ఆడటం అంటే గొప్ప విషయమనే చెప్పాలి.





[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























