టాలీవుడ్ లో చిన్నగా పాన్ ఇండియా సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. తాజాగా సూర్య కూడా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘ఎదర్కుం తనిందవన్’ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. సూర్య కెరీర్ లో వస్తున్న 40వ సినిమా ఇది. ఇటీవలే సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈసినిమాను ముందు ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కానీ ఇప్పుడు మళ్లీ ఆ డేట్ ను మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 10న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణసంస్థ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#EtharkkumThunindhavan is releasing on March 10th, 2022!
See you soon in theatres!@Suriya_offl @pandiraj_dir #Sathyaraj @immancomposer @RathnaveluDop @priyankaamohan @sooriofficial #ETfromMarch10 #ET pic.twitter.com/HPJ9cYw9Eh— Sun Pictures (@sunpictures) February 1, 2022
కాగా ఈసినిమాలో డాక్టర్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈసినిమాకు డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేల్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
కాగా ప్రస్తుతం సూర్య వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకుని ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా పొందారు. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























