రాధేశ్యామ్ :గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “రాధేశ్యామ్ ” మూవీ మార్చి నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
RRR : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గోండు వీరుడు కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .
భీమ్లానాయక్: సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆచార్య : కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. ” ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
F 3: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ ఏప్రిల్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “F 2” మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో వెంకటేష్ , వరుణ్ తేజ్ ప్రేక్షకులను మరోసారి “F 3” మూవీతో అలరించనున్నారు.
సర్కారువారి పాట: సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. షూటింగ్ ముగింపు దశలో ఉన్న ”సర్కారు వారి పాట”మూవీ ని మే 12 వ తేదీ గా సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. మహేష్ బాబు , కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: