కరోనా థర్డ్ వేవ్ వల్ల మళ్లీ సినిమా రిలీజ్ ల వాయిదాల పర్వం మొదలైంది. ఒకదాని తర్వాత ఒక సినిమా పోస్ట్ పోన్ అవుతున్నాయి. పెద్ద సినిమాలే అనుకుంటే చిన్న సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేకపోవడం.. థియేటర్లలో ఆక్యూపెన్సీ తగ్గించడం.. కొన్ని చోట్ల అయితే ఏకంగా థియేటర్లు మూత పడటంతో ఇలాంటి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి నష్టపోవడం కంటే కొంచం లేట్ అయినా తరువాత రిలీజ్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అందుకే పరిస్థితులు కాస్త నార్మల్ స్థితికి వచ్చాకే సినిమాలు రిలీజ్ చేస్తామని చెబుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ వాయిదాల లిస్ట్ లోకి మరో సినిమా కూడా చేరింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సెల్యూట్. ఈసినిమాను జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈసినిమాను కూడా వాయిదా వేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
#SaluteMovie #Salute pic.twitter.com/jtUGBKM8ke
— Wayfarer Films (@DQsWayfarerFilm) January 10, 2022
కాగా ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ డయానా పెంటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో మనోజ్ కె జయన్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, లక్ష్మీ గోపాలస్వామి, విజయ్ కుమార్, గణపతి యస్ పొదువాల్, అలెన్సియర్ లే లోపేజ్, బిను పప్పు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫేరర్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈసినిమాను నిర్మిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























