టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకునే విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా తన సినీ కెరీర్ నే మార్చేసింది. ఆ తరువాత కూడా మంచి హిట్స్ కొట్టడంతో అటు తెలుగులోనే కాదు నార్త్ లో కూడా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ పెరిగిపోయింది. ఇక విజయ్ కూడా కేవలం సినిమాలతోనే కాదు.. తను చేసే విభిన్నమైన పనుల ద్వారా కూడా ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. అటు సినిమాలతో పాటు నిర్మాతగా మరోవైపు బిజినెస్ రంగంలోకి కూడా దిగి తన టాలెంట్ తో ఎంతోమంది యువతకు స్పూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని విజయ్ దేవరకొండ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దేవరశాంటా 2021 హ్యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్ట్ లు రాగా వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున బహుమతి అందించనున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అని ట్వీట్ లో
పేర్కొన్నారు.
My loves, check for your names🤍@TeamDeverakonda will Reach out
And the money transfers will follow 🙂Love,
Vijay #DeveraSanta21 pic.twitter.com/PQ7Jc7cUa8— Vijay Deverakonda (@TheDeverakonda) January 7, 2022
కాగా తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. ఈ ఏడాది కూడా ఆయన నగదు రూపంలో బహుమతులు ప్రకటించారు. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 100 మందికి 10 లక్షల రూపాయలు బహుమతిగా పంచుతున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























