కింగ్ నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా బంగార్రాజు. ఇక వీరిద్దరి కాంబినేషన్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై చూడాలా అని అక్కినేని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అందుకుతగ్గట్టే బంగార్రాజు కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి బరిలోకి దిగనున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అయితే రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది. మరోవైపు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. అవికూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన పార్టీ సాంగ్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటల 22 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Watch out for the teaser tomorrow!!🔥#Bangarraju #Bangarrajuteaser#pandugalanticinema@chay_akkineni@kalyankrishna_k @fariaabdullah2@iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ @zeemusiccompany @zeemusicsouth pic.twitter.com/4L1JKgAkoU
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 31, 2021
కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయనా మూవీ సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ.. నాగ చైతన్య కు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా.. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: