విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మూవీ లైగర్. ఇక ఇన్ని రోజులు షూటింగ్ పనులతో బిజీగా ఉండి సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మాత్రం వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తుంది. ఒకేసారి మూడు అప్ డేట్స్ ఇచ్చి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. దీనిలో భాగంగానే నిన్న బిగ్ అనౌన్స్ మెంట్ ఫస్ట్ గ్లింప్స్ అప్ డేట్ కు సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇక చెప్పినట్లుగానే ఈరోజు ఈ సినిమా నుంచి బెస్ట్ స్టిల్ రిలీజ్ చేసింది యూనిట్. విజయ్ దేవరకొండ కెమెరా పట్టుకొని… ఉన్న స్టిల్ తో పాటు పూరి జగన్నాథ్ చెప్పే కథ వింటూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#LigerFirstGlimpse Tomorrow at 10.03 AM 🔥
Get Ready LIGERS 🤙 https://t.co/zplggIBHyt— Puri Connects (@PuriConnects) December 30, 2021
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. 2022, ఆగస్ట్ 25న లైగర్ సినిమా రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























