సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ పుష్ప.. ది రైజ్ ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత మొదట రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమా ఇదే. ఈసినిమాకు ముందు నుండే మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సాలిడ్ గా కలెక్షన్స్ ను రాబడుతుంది.ఇక ఈసినిమాలో బన్ని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అంత మాస్ గెటప్ లో.. అలానే యాసలో డైలాగ్స్ చెప్పడం.. నటన, యాక్షన్ సీన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం.. ఇక బన్నీ కూడా తన పాత్రలో చెలరేగిపోవడంతో సినిమాలో సక్సెస్ లో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇప్పటికే సినిమా చూసిన వారందరూ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. నార్త్ లో కూడా పుష్ప హవా బాగానే నడుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా చూసిన మెగాస్టార్ కూడా పుష్ప యూనిట్ ను అభినందించారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ స్వయంగా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియచేసింది. పుష్ప సినిమాను మెగాస్టార్ చిరు చూశారు.. సినిమాలో ప్రతి ఒక్క అంశం ఆయనకు నచ్చింది.. ఈనేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ను అలాగే చిత్రయూనిట్ ను అభినందించారు.
View this post on Instagram
ఇక పుష్ప పార్ట్ 2 కి సంబంధించిన షూటింగ్ ను కూడా మళ్లీ త్వరలోనే మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. లేట్ చేయకుండా వీలైనంత తొందరలోనే ఈసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా పవర్ ఫుల్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి పార్ట్ 2 ను ఏరేంజ్ లో తీస్తారో..!




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























