నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాకు రీమేక్ ఇది. ఈసినిమా కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది. అయితే మధ్యలో కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడటంతో షూటింగ్ కూడా లేట్ అయింది. దీంతో రిలీజ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. 2022 ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంకా చెప్పలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This valentines month come fall in love with Dev & Nidhi. #GurthundhaSeethakalam in theatres from Feb 2022❤️#Guts@ActorSatyaDev @tamannaahspeaks@nagshekar @akash_megha @IAmKavyaShetty @kaalabhairava7 @nagshekarmov #VedaksharaMovies #ManikantaEntertainments@anandaudioTolly pic.twitter.com/nAkfdu2Gzs
— Tamannaah Bhatia (@tamannaahspeaks) December 13, 2021
ఇంకా ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాను నాగశేఖర్, భావన రవి నిర్మిస్తున్నారు. కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























