తమిళంలో “ముగమూడి “, తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో పూజాహెగ్డే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” , “#PSPK 28” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా గుర్తింపు పొందిన పూజాహెగ్డే ఎక్కువగా నటించింది తెలుగు మూవీస్ లోనే . తెలుగు , తమిళ ,హిందీ భాషా చిత్రాల అవకాశం అందుకుంటున్నారు. . అయితే పూజాహెగ్డే ఈ మూడు భాషలకు చెందిన అమ్మాయి కాదు. కన్నడ అమ్మాయి. ఆ విషయం పూజాహెగ్డే ని అడిగితే, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో పాపులర్ అయినా కర్ణాటక అమ్మాయిగా గుర్తింపు పొందడమే తనకు ఇష్టమనీ , తన మూలాల్ని తాను ఎప్పుడూ ప్రేమిస్తాననీ , మంగుళూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గర్విస్తాననీ , ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ, కన్నడ అమ్మాయి అనిపించుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాననీ , కన్నడ నీళ్లలో ఏదో ఉందనీ , గ్లామర్ తారలంతా అక్కడ్నుంచే వస్తున్నారని చాలామంది తనతో అంటుంటారనీ , ఆ మాట విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుందనీ ,తన మాతృభాష నుంచి అవకాశం వస్తే నటించడానికి సిద్థంగా ఉన్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































